Samantha, Raj Nidimoru: డేటింగ్‌లో.. స‌మంత‌, రాజ్‌ నిడిమోరు! మేనేజ‌ర్ ఏమ‌న్నాడంటే?

ABN, Publish Date - May 16 , 2025 | 11:00 AM

గ‌త కొంత కాలంగా స‌మంత (Samantha) ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యంలో అనేక విర్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

samantha

గ‌త కొంత కాలంగా స‌మంత (Samantha) ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యంలో అనేక విర్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. విడాకుల అనంత‌రం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మైన స‌మంత సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంది. అనంత‌రం ఆరోగ్యం కాస్త మెరుగైన త‌ర్వాత అర‌కొర సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. య‌శోద అనంత‌రం మ‌రో సినిఆ చేయ‌ని స‌మంత సిటీడెల్ సిరీస్‌లో న‌టించి మెప్పించింది. ఈ సిరీస్ స్టార్ట్ అయింది మొద‌లు ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమోరుతో స‌మంత‌కు మ‌ధ్యేదో న‌డుస్తోంది, వారిరువు డేటింగ్‌లో ఉన్నారంటే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్‌లో అగ్ర స్థానంలో దూసుకువెళుతున్న ద‌ర్వ‌క‌ద్వ‌యం రాజ్ అండే డీకే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఆపై ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్‌2లో స‌మంత (Samantha) న‌టించ‌డం, మ‌ళ్లీ ఇటీవ‌ల‌సిటాడెల్‌లోనూ స‌మంత న‌టించ‌డంతో రాజ్‌, స‌మంత రిలేష‌న్‌పై పుకార్లు మొద‌లయ్యాయి. అంతేగాక స‌మంత తాజాగా నిర్మాత‌గా మారి నిర్మించిన శుభం (Subham) సినిమాకు రాజ్ ఎక్జిగ్యూటివ్ ప్రొడ్యుస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, ప‌లు సంద‌ర్భాల్లో వారిరువు క‌లివిడిగా క‌నిపించ‌డంతో పుట్ట‌గొడుగుల్లా అనేక రేమ‌ర్లు పుట్టుకొచ్చాయి. రెండు రోజుల క్రితం శుభం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా స‌మంత రాజ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేసి శుభం’తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని పోస్టు చేయ‌డం అంతా వారిపై వ‌స్తోన్న‌ రూమ‌ర్స్ నిజ‌మే అని న‌మ్మ‌డం స్టార్ట్ చేశారు.

ఈ వార్త కాస్త సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుతండ‌డంతో స‌మంత (Samantha) మేనేజ‌ర్ స్పందించి ఆ వార్త‌ల‌పై ఓ క్లారిటీ చ్చే ప్ర‌య‌త్నం చేశారు. రాజ్, స‌మంత‌ల మ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌ని, జ‌స్ట్ ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని, వారిద్ద‌రిపై వ‌స్తున్న రూమ‌ర్స్‌ను ప‌ట్టించుకోవ‌ద్దంటూ కోరారు. ఇదిలాఉంటే రాజ్‌ నిడిమోరు (Raj Nidimoru) ఇప్ప‌టికే త‌న భార్య శ్యామాలికి విడాకులు సైతం ఇచ్చిన‌ట్లు ఆంగ్ల మీడియాలు పేర్కొన‌డం ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించ‌కుంది. మ‌రి కొద్ది రోజుల‌తే గానీ ఈ వార్త‌ల విష‌యంలో ఏది వాస్త‌వ‌మో, ఏది అవాస్త‌మో తేల‌నుంది.

Updated Date - May 16 , 2025 | 11:26 AM