Malavika: నాలుగు పదుల వయసులోనూ... చెలరేగిపోతుంది.. 

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:36 AM

తెలుగులో చాలా బాగుంది, దీవించండి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, నవ్వుతు బతకాలిరా  వంటి చిత్రాలతో అలరించింది మాళవిక.  ఇప్పుడు అందాల ఆరబోతతో చెలరేగిపోతోంది.

తెలుగులో 'చాలా బాగుంది', 'దీవించండి', 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్', 'నవ్వుతు బతకాలిరా' వంటి చిత్రాలతో అలరించింది మాళవిక. ‘కరుప్పుదాన్‌ ఎనక్కు పుడిచ్చ కలరు’ అనే పాటతో కోలీవుడ్‌ ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకున్న మాళవిక 45 యేళ్ళ వయసులోనూ గ్లామర్‌గా కనిపిస్తూ, ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్నారు. ఆమె తాజాగా  స్విమ్‌ సూట్‌ ధరించి  స్విమింగ్ పూల్ లో హాట్ హాట్ గా దర్శనమిచ్చింది. ఈ  ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లతో పాటు సినీ అభిమానులు ఈ వయస్సులోనూ గ్లామర్‌ ఏ మాత్రం తగ్గలేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  2007లో ఓ పారిశ్రామికవేత్త ను  వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లయిన మాళవిక... ‘తిరుట్టు పయలే’ చిత్రం తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.

Malavika.jpg

ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆశపడుతున్నారు. సిమ్రన్‌, జ్యోతిక, దేవయాని వంటి వారు రీఎంట్రీ అయి సినిమాల్లో రాణిస్తున్నారు. కానీ, మాళవికకు అవకాశం ఇచ్చేందుకు దర్శక నిర్మాత లు వెనుకంజ వేస్తున్నారు. ఇదిలావుంటే, యంగ్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుం డా స్విమ్‌ సూట్‌లో ఫొటో షూట్‌ చేసి వాటిని షేర్‌ చేశారు. ఈ ఫొటోలతో తనకు మంచి పబ్లిసిటీ వస్తాయని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. పైగా, విలన్‌ పాత్రల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

Updated Date - Jul 12 , 2025 | 10:24 PM