OG Movie: రూమర్స్ నమ్మకండి..
ABN , Publish Date - Jul 02 , 2025 | 08:59 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఓజీ (OG) ఒకటి.
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఓజీ (OG) ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా తెలుగుతెరకు పరిచయం కానున్నాడు. ఇక వీరితో పాటు అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఓజీ నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు వాయిదాల మీద నడుస్తున్న విషయం తెల్సిందే. ఓజీ కూడా ఎక్కడ దానిలాగే వాయిదాల చుట్టూ తిరుగుతుందేమో అని భయపడుతున్నారు. అసలు ఓజీ గతేడాది సెప్టెంబర్ లోనే రావాల్సి ఉంది. ఇక అప్పుడు వాయిదా పడిన ఈ ఏడాది సెప్టెంబర్ 25 కు వస్తుంది.
సర్లే ఎలాగైనా ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుంది అనుకోని సంబరపడుతున్న సమయంలో అఖండ 2 కూడా అదే రోజున వస్తున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ గుండెల్లో బాంబ్ పడింది. ఇక ఓజీ కూడా రానట్టే. ఈ సినిమా కూడా వాయిదా పడిందని రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణతో పోటీ ఎందుకని పవన్ వెనక్కి తగ్గాడని సోషల్ మీడియాలో చర్చలు ఎక్కువ అయ్యాయి. దీంతో మేకర్స్ ఈ పుకార్లపై స్పందించారు. రూమర్స్ నమ్మకండి అంటూ పవన్ ఓజీ గిఫ్ ను పోస్ట్ చేశారు. 25 సెప్టెంబర్ నే ఓజీ వస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో ఓజీ చెప్పిన టైమ్ కే వస్తుందని, మార్పు లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Akhanda 2: అఖండ 2లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్ .. పోస్టర్ అదిరింది