Murari 4K: మురారి రీ రిలీజ్.. అక్కడ థియేటర్లు హౌజ్‌ఫుల్
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:17 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కెరీర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన క్లాసిక్ చిత్రం ‘మురారి’.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కెరీర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన క్లాసిక్ చిత్రం ‘మురారి’ (Murari) మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2001లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మహేశ్ బాబు క్రేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. కథ, భావోద్వేగాలు, సంగీతం సమపాళ్లలో కలిసిన ‘మురారి’ ఇప్పటికీ అభిమానులకు చాలా ఫెవరేట్.

సినిమా రిలీజ్ అయి రెండు పుష్కరాలు గడిచినా సినిమాపై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అదే క్రమంలో ఇప్పవటి వరకు రీ రిలీజ్ చేసిన చిత్రాలన్నీ మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఇప్పుడు ‘మురారి’సినిమాని సైతం 4K ఫార్మాట్‌లో రీ రిలీజ్ చేయనున్నారు. నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రీ రిలీజ్ చేస్తుండగా, ఆంధ్ర ప్రదేశ్‌లో పేరొందిన డిస్ట్రిబ్యూటర్లు బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. రాజమండ్రి వంటి ప్రాంతాల్లో అల్రేడీ అడ్వాన్స్ బుకింగ్ జరిగి టికెట్లన్నీ అమ్మడు పోయి హౌజ్‌ఫుల్ అండం విశేషం.
అయితే.. ఈ రీ రిలీజ్‌తో మరో కొత్త ట్రెండ్‌కు తెరలేపారు. సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ.99, మల్టిప్లెక్స్‌లలో రూ.105గా నిర్ణయించడంతో ప్రేక్షకులు భారీగా బుకింగ్స్‌కు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధర ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ, చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్‌ఫుల్‌గా మారాయి.
అదే ఉత్సాహంలో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ‘మురారి’ సినిమాకు ముందు వారణాసి గ్లింప్స్‌ను అటాచ్ చేయనుండటంతో థియేటర్లలో పండగ వాతావరణం నెలకొననుంది. ఈ రీ రిలీజ్ మరోసారి ‘మురారి’ మ్యాజిక్‌ను పెద్ద తెరపై రుచి చూపించబోతోందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.