Mahesh Family: లేడీ గాగా షోలో.. మహేశ్ ఫ్యామిలీ
ABN , Publish Date - Sep 08 , 2025 | 10:11 PM
మహేష్‌బాబు భార్య, నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, మధుర జ్ఞాపకాలను షేర్ చేస్తుంటారు.
మహేష్‌బాబు భార్య, నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, మధుర జ్ఞాపకాలను షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం పిల్లలతోపాటు నమ్రత, గౌతమ్, సితారా న్యూయార్క్ టూర్‌లో ఉన్నారు. అక్కడి పాప్ సింగర్ లేడీ గాగా (Lady Gaga) షోకు హాజరయ్యారు.
ఆ షోలో కుటుంబం ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు నమ్రతా. స్టేజ్‌పై లేడీ గాగా ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్. బయట కుటుంబంతో దిగిన సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు. ఈ షో పట్ల తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. ‘ఒకే పదంలో చెప్పాలంటూ.. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. లేడీ గాగా, యూ ఆర్ రాక్ స్టార్. నీ షోలో ప్రతి క్షణం అమోఘంగా అనిపించింది. ఎంతో ప్రేమతో’ అని రాశారు.