Mahesh Babu: నీ పక్కన లేకపోవడం ఇదే మొదటిసారి
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:22 PM
మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్ పుట్టినరోజు నేడు. దీనిని ఉద్దేశించి మహేశ్ ట్వీట్ చేశారు.
మహేశ్‌బాబు (Mahesh Babu) కుమారుడు గౌతమ్ Gowtham Ghattamaneni) పుట్టినరోజు నేడు. దీనిని ఉద్దేశించి మహేశ్ ట్వీట్ చేశారు. ‘ఈ బర్త్‌డేకి నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ కుమారుడు గౌతమ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు. ‘ప్రతిసారీ నీ పుట్టినరోజు నీ పక్కనే ఉంటాను.. ఈసారి లేకపోవడం కాస్త బాధగా ఉంది’ అని మహేశ్ ఎమోషనల్ అయ్యారు. గతంలో దిగిన ఫొటోను షేర్ చేశారు. 19వ వసంతంలోకి అడుగుపెట్టిన గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి’ అని విషెస్ తెలియజేశారు. మహేశ్ అభిమానులు పలువురు నెటిజన్లు గౌతమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రస్తుతం మహేశ్ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ను నైరోబి, టాంజానియాల్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.