Vaaranaasi: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు పాత్రల్లో మహేష్

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:30 PM

ప్రస్తుతం తెలుగునాటనే కాదు, యావత్ భారతంలోని సినీ ఫ్యాన్స్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న వారణాసి( Vaaranaasi) గురించే ముచ్చటించు కుంటున్నారు.

Vaaranaasi

Vaaranaasi: ప్రస్తుతం తెలుగునాటనే కాదు, యావత్ భారతంలోని సినీ ఫ్యాన్స్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న వారణాసి( Vaaranaasi) గురించే ముచ్చటించు కుంటున్నారు. మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తూ ఉండడంతో వారణాసి పై ఓ స్పెషల్ బజ్ నెలకొంది. ఇక ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలిసీ సినీ బఫ్స్ మరింత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సంచారీ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక వారణాసి గురించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గత కొన్నిరోజుల నుంచి వారణాసి చిత్రంలో మహేశ్.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు గెటప్స్ లో కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో రుద్ర అనేక్యారెక్టర్ లో మహేశ్ కనిపించనున్నాడని అందరికి తెల్సిందే. అలాగే రామునిగానూ ఈ చిత్రంలో మహేశ్ మురిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రలు కాకుండా మరో మూడు పాత్రలు మహేశ్ ధరించనున్నాడట. మరి ఆ పాత్రలు ఏంటి అన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో వారణాసి ని రిలీజ్ చేసే నేపథ్యంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే దిశగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని, అందువల్లే ఐదు పాత్రల్లో మహేశ్ బాబును నటింప చేస్తున్నాడనీ టాక్. ఇప్పటివరకు మహేశ్ ఇలాంటి గెటప్స్ లో కనిపించింది లేదు. ఈసారి జక్కన్న.. మహేశ్ ని మునుపెన్నడూ చూడని గెటప్స్ లో చూపించబోతున్నాడు. ఈ మూవీ మరి ఎప్పుడు ఏ తీరున జనం ముందు నిలుస్తుందో? ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Dec 10 , 2025 | 05:34 PM