సినిమాకే హైలెట్‌గా

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:31 AM

రామ్‌ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌బాబు.పి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని...

రామ్‌ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌బాబు.పి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, యలమంచలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ హీరో ఉపేంద్ర ఇందులో సూపర్‌స్టార్‌ సూర్యకుమార్‌ అనే శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాలో కీలకమైన టాకీ పార్ట్‌ను హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నారు. రామ్‌, ఉపేంద్ర మధ్య తెరకెక్కుతోన్న ఈ కీలక సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా ఉంటాయని మేకర్స్‌ తెలిపారు. ఇందులో రామ్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ నుని, సంగీతం: వివేక్‌- మెర్విన్‌.

Updated Date - Jun 16 , 2025 | 04:34 AM