Mahesh Babu: వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్.. అందర్నీ గర్వ పడేలా చేస్తా
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:40 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)- రాజమౌళి(Rajamouli) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29. రెండేళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)- రాజమౌళి(Rajamouli) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29. రెండేళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ ను నేడు గ్లోబ్ ట్రాటర్ అనే ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేశారు. మొదటి నుంచి అనుకుంటున్నట్లే వారణాసి(Vaaranaasi) అనే టైటిల్ నే జక్కన్న ఫిక్స్ చేశాడు. దీంతో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశాడు.
ఇక ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. ' మిమ్మల్ని కలిసి చాలా రోజులవుతుంది. నార్మల్ ఎంట్రీ ఇస్తాను అంటే.. రాజమౌళి వద్దు అన్నాడు. బ్లూ డ్రెస్ లో వస్తాను అంటే రాజమౌళి ఇలా స్పెషల్ గా తీసుకొచ్చాడు. ఇంకా నయం చొక్కాలేకుండా తీసుకోస్తారేమో అనుకున్నాను. పౌరాణికం చేయమని నాన్నగారు ఎప్పుడూ అడుగుతుండేవారు. ఆయన మాటలు నేను ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి.
వారణాసి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందర్నీ గర్వ పడేలా చేస్తాను. ముఖ్యంగా రాజమౌళిగారిని. వారణాసి విడుదలైన తరవాత దేశమంతా గర్వంగా ఫీలవుతుంది. ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే.. ముందు ముందు ఎలా ఉండబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక అభిమానులకు నేను ఏం చెప్పాలి. నాకు తెలిసింది ఒక్కటే. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేమి తెలియదు. అభిమానుల సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి' అంటూ ముగించాడు.