SSMB29: సరిపోయారు ఇద్దరు.. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు! మహేష్ బాబు – రాజమౌళి ట్వీట్ వార్ వైరల్
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:51 AM
మహేష్ బాబు – రాజమౌళి ట్వీట్లతో సోషల్ మీడియాలో హంగామా! SSMB 29 అప్‌డేట్‌పై ఫన్ కన్వర్సేషన్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ఎదురు చూస్తున్న సినిమా ‘SSMB 29’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పెద్ద అప్డేట్ నవంబర్‌లో వస్తుందనే హామీ రాజమౌళి ముందే ఇచ్చారు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ మహేష్ బాబు సరదాగా సోషల్ మీడియాలో జక్కన్నను టీజ్ చేశారు.
ట్విట్టర్‌లో మహేష్ బాబు – రాజమౌళి సంభాషణ వైరల్
నవంబర్ మొదలైన వెంటనే మహేష్ బాబు ఎక్స్ (ట్విట్టర్)లోకి వచ్చి, “నవంబర్ వచ్చేసింది సార్... అప్డేట్ ఎక్కడ?” అంటూ జక్కన్నను ట్యాగ్ చేశారు. వెంటనే రాజమౌళి కూడా రిప్లై ఇస్తూ, “అవును మహేష్... కానీ ఏ సినిమాకి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నావు?” అని హాస్యాత్మకంగా సమాధానమిచ్చారు. దానికి మహేష్ బాబు “సార్… ఇంత స్లోగా ఇస్తే 2030లో స్టార్ట్ చేద్దామా?” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదంతా అభిమానులలో నవ్వులు పూయించింది.
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పేర్లు కూడా..
మహేష్ బాబు మరో ట్వీట్‌లో “మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్ వీధుల్లో ఇన్‌స్టా స్టోరీలు వేస్తోంది” అని సరదాగా రాసారు. దానికి ప్రియాంక వెంటనే స్పందిస్తూ “నువ్వు సెట్‌లో చెప్పిన సీక్రెట్స్ అన్నీ నేనే లీక్ చేస్తానా హీరో?” అంటూ పంచ్ ఇచ్చింది.
ఇంతలో మహేష్ మరో ట్వీట్‌లో “పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సర్ప్రైజ్ కదా?” అని రాసేసరికి సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. పృథ్వీరాజ్ కూడా స్పందిస్తూ, “ఇలా హైదరాబాద్‌కి వెకేషన్‌కి వస్తే నా ఫ్యామిలీ ఇప్పుడు అనుమానిస్తుంది సార్!” అంటూ హాస్యంగా ట్వీట్ చేశారు.

రాజమౌళి – మహేష్ ఫన్ వార్.. ఫుల్ ట్రెండ్
రాజమౌళి చివరికి “మహేష్, నువ్వు అన్నీ సర్ప్రైజ్‌లను పాడు చేశావ్!” అంటూ ట్వీట్ చేయగా, మహేష్ “ఓకే డీల్… రేపు అందరికీ తెలిసిన ఏదో ఒక విషయాన్ని ప్రకటించండి” అంటూ సటైర్ వేశారు. జక్కన్న కూడా “డీల్ ఓకే… కానీ పంచ్ ఎక్కువేసినందుకు ఫస్ట్ లుక్ రిలీజ్‌ను ఆలస్యం చేయాలి!” అని సరదాగా కౌంటర్ ఇచ్చారు.
అభిమానుల్లో.. ఎగ్జైట్మెంట్ పీక్స్
ఈ ట్వీట్లతో #SSMB29, #MaheshBabu, #Rajamouli, #noveMBerwillbehiSStoRic హ్యాష్‌ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మేకర్స్ ఇంకా అధికారికంగా ఏదీ ప్రకటించకపోయినా, ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో నటిస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అప్డేట్ వస్తుందా, ఫస్ట్ లుక్ విడుదల అవుతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోయింది.
రాజమౌళి.. స్టైల్ ప్రమోషన్ టచ్!
ఏ పోస్టర్, టీజర్ లేకుండా కేవలం ట్వీట్లతోనే హైప్ పెంచడం రాజమౌళి మార్కెటింగ్ మైండ్‌కే సాధ్యం.
మహేష్ బాబు సరదా ట్వీట్లు కూడా ఈ బజ్‌ని మరింతగా పెంచేశాయి. నవంబర్‌లో రాబోయే అప్డేట్‌తో “SSMB 29” సినిమా ప్రమోషన్ గేమ్ మరో లెవెల్‌కి వెళ్లనుంది.