NTR- Allu Arjun: ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్.. నమ్మకం లేదు దొరా
ABN , Publish Date - Dec 16 , 2025 | 08:40 PM
ఇండస్ట్రీలో మల్టీస్టారర్స్ ఎప్పుడు చాలా స్పెషల్ గా ఉంటాయి. ఒక హీరోను స్క్రీన్ మీద చూడడమే స్పెషల్ అంటే మల్టీస్టారర్ అయితే ఇద్దరు, ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో చూడడం ఇంకా స్పెషల్.
NTR- Allu Arjun: ఇండస్ట్రీలో మల్టీస్టారర్స్ ఎప్పుడు చాలా స్పెషల్ గా ఉంటాయి. ఒక హీరోను స్క్రీన్ మీద చూడడమే స్పెషల్ అంటే మల్టీస్టారర్ అయితే ఇద్దరు, ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో చూడడం ఇంకా స్పెషల్. అలా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దీనిని మించిన మల్టీస్టారర్ మళ్లీ రాలేదు. ఇక ఇప్పుడు రాబోతుంది అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆర్ఆర్ఆర్ (RRR) లో రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్ (NTR) నటించగా.. ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) - ఎన్టీఆర్ మల్టీస్టారర్ కి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరిని ఒక్కటిగా చూపించే ఆ దర్శకుడు ఎవరు అంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)అని అంటున్నారు.
ఈ ఏడాది కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాడు లోకేష్. కూలీకి ముందువరకు పరాజయమే ఎరుగని డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న లోకేష్.. కూలీ పరాజయంతో దారుణంగా ట్రోల్ అయ్యాడు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉంటూనే ఇంకోపాక్క హీరోగా కూడా మారాడు. డీసీ పేరుతో ఆ సినిమా తెరకెక్కుతుంది. ఇక వీటితో పాటు లోకేష్ ఒక మల్టీస్టారర్ కథను రెడీ చేసుకున్నాడట. దానికోసం స్టార్ హీరోలను వెతుకుతున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఆ కథను తెలుగు స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ కి వినిపించగా.. ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఇంకో హీరో పాత్ర కోసం ఎన్టీఆర్ ని అనుకుంటున్నారట. తారక్ కి కూడా కథ వినిపించారని, త్వరలోనే ఎన్టీఆర్ ఓకే చేస్తాడని చెప్పుకొస్తున్నారు. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే బావుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ.. అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది ఫినిష్ అయ్యేవరకు బన్నీ బయటకు రాడు. దీని తరువాత త్రివిక్రమ్ లైన్లో ఉన్నాడు. ఇక తారక్.. డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ ఫినిష్ అయ్యి లోకేష్ మల్టీస్టారర్ మొదలుపెట్టేసరికి ఏడాది కూడా పూర్తవుతుంది.. మాకు నమ్మకం లేదు దొరా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.