Little Hearts: ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్ హిట్ కొట్టింది..
ABN , Publish Date - Sep 06 , 2025 | 10:39 AM
‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) సినిమా వైల్డ్ ఫైర్‌లా వెళ్తోందని నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) అన్నారు. ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు రావడం ఖాయమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు
‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) సినిమా వైల్డ్ ఫైర్‌లా వెళ్తోందని నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) అన్నారు. ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు రావడం ఖాయమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇలాంటి చిత్రాల ద్వారానే నిర్మాతలకు గౌరవం పెరుగుతుందన్నారు బన్నీ వాస్. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. వంశీ నందిపాటి, బన్నీ వాసు గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ఆడుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, సూపర్ హిట్ కావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. (wildfire little Hearts)
బన్నీవాస్ మాట్లాడుతూ ‘లిటిల్ హార్ట్స్’ లాంటి చిన్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో అన్న సందేహంతోనే 3 షోస్‌తో ప్రీమియర్స్ చేశాం. సాయంత్రానికి 29 షోస్ పడ్డాయి. ఈ షోస్ అన్నీ దాదాపు 90 పర్సెంట్ ఫిల్ అయ్యాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో ఒక్క టికెట్ కూడా లేదు. శనివారం బుకింగ్ అయ్యాయి. ఒక చిన్న చిత్రానికి ప్రేక్షకులు అసాధారణ విజయాన్ని అందించడం గొప్ప విషయం. సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఒక మంచి సినిమా అందిస్తే అది చిన్నదా పెద్దదా అని చూడకుండా సక్సెస్ నిరూపించారు. ఈ రోజు ప్రేక్షకులు కేవలం సూపర్ హిట్ చిత్రాలకే వెళ్తున్నారు. లిటిల్ హార్ట్స్‌కు పెరుగుతున్న ఆదరణ చూస్తే చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన సినిమాగా అనిపిస్తుంది. దాదాపు 50 రోజుల వరకు ఓటీటీలోకి తీసుకురావొద్దని కోరుతున్నా. ఈటీవీ నుంచి ‘నువ్వే కావాలి’ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ‘లిటిల్ హార్ట్స్’ వైల్డ్ ఫైర్‌లా వెళ్తోంది. అనూహ్యమైన వసూళ్లు ఈ సినిమాకు వస్తాయి. ఇలాంటి చిత్రాల ద్వారానే మాకు గౌరవం పెరుగుతుంది. ‘ప్రేమలు’ వంటి సినిమాల చూశాక మన తె?నిగులో అలాంటి మూవీస్ అందిేస్త తప్పకుండా ఆదరిస?్తరని అనిపించేది. ‘‘లిటిల్ హార్ట్స్’’ తో అది నిజమైంది. ఈ సినిమాను మాకు ఇచ్చిన ఆదిత్య హాసన్‌కు, ఈటీవీ విన్‌కు థ్యాంక్స్. కాలేజ్ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో వెళ్లి చూడండి.. బాగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌తో వస్తే ఊహించనంత కలెక్షన్స్ ఇస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సాయి మార్తాండ్ ఒక ఆంథెటిక్, ఆర్గానిక్ ఎంటర్‌టైన్‌మెంట్ తీశాడు. మౌళి అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక కొత్త స్టార్‌గా తనను తాను మలుచుకోబోతున్నాడు అనిపిస్తోంది. శివానీ కూడా బాగా నటించింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంతగా ‘లిటిల్ హార్ట్స్’ చూసి నవ్వుకున్నాం, ఆ సినిమా స్థాయి విజయం వస్తుందంటూ సోషల్ మీడియాలో అప్రిషియేషన్స్ వస్తున్నాయి’ అన్నారు.
హీరో మౌళి తనుజ్ మాట్లాడుతూ ‘ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. మా సినిమాను సూపర్ హిట్ చేసిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్. 3 షోస్ నుంచి ప్రీమియర్స్ మొదలై 29 షోస్ కు పెరిగాయి. ఇదంతా బన్నీ వాస్ గారి ప్లానింగ్. మా సినిమాను వారు డిస్ర్టిబ్యూట్ చేస్తున్నారని తెలియగానే ‘మీరు రిలాక్స్ కావొచ్చు’ అని నా సన్నిహితులు చెప్పారు. వాళ్లు గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారని. బన్నీ వాస్ డిస్ర్టిబ్యూషన్‌లో ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు’ అన్నారు.
శివానీ నాగారం మాట్లాడుతూ ‘ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి రోమ్ కామ్ రాలేదు. మా సినిమాలోని క్యారెక్టర్స్, డైలాగ్స్, మ్యూజిక్.. ఇలా ప్రతి అంశం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్న వాళ్లు ప్రతి షో తర్వాత మాకు సోషల్ మీడియా ద్వారా తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు’ అన్నారు.
సాయి మార్తాండ్ మాట్లాడుతూ ‘లిటిల్ హార్ట్స్’ కథ రాశాక, కొన్ని ప్రొడక్షన్ కంపెనీస్‌కు స్ర్కిప్ట్ పంపాను. ప్రస్తుతంం రొమాంటిక్ కామెడీ ఎవరూ చూడటం లేదని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత ఈ కథ మౌళికి చెబితే బాగుందని, సాయికృష్ణ చెప్పించారు. ఆయనకూ నచ్చింది. ఆదిత్య హాసన్ ప్రొడక్షన్ లోకి వచ్చారు. బన్నీవాస్ గారు, వంశీ గారు డిస్ర్టిబ్యూట్ చేశారు. ఇలా ‘లిటిల్ హార్ట్స్’ ఒక సక్సెస్ ఫుల్ సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. రామ్‌కామ్స్ చూడట్లేదన్న అదే ప్రొడ్యూసర్ రోజు మన వాళ్లకు ఫోన్ చేసి చాలా ఎంజాయ్ చేశాం అంటున్నారు. ఇదే మేం సాఽధించిన సక్సెస్’ అన్నారు.