Linga Bhairavi Temple : లింగ భైరవి ఆలయం ఇదే.. ఫొటోలు మీరూ చూడండి..
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:32 AM
సమంత పెళ్లి సోమవారం రాజ్ నిడిమోరుతో కోయంబత్తురు, ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో ‘భూత శుద్థి వివాహం’ జరిగింది. అప్పటి నుంచి నెటిజన్లు, ప్రేక్షకులు లింగ భైరవి దేవాలయం, భూత శుద్థి వివాహం గురించి తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నారు.
సమంత పెళ్లి సోమవారం రాజ్ నిడిమోరుతో కోయంబత్తురు, ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో ‘భూత శుద్థి వివాహం’ జరిగింది. అప్పటి నుంచి నెటిజన్లు, ప్రేక్షకులు లింగ భైరవి దేవాలయం, భూత శుద్థి వివాహం గురించి తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నారు. దీంతో లింగ భైరవి ఆలయం ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ ఫోటోలను మీరూ వీక్షించండి.

ఈశా ఫౌండేషన్‌కు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ ఆలయం గురించి తెలుస్తుంది. ఇప్పుడు సమంత పెళ్లితో మరింత పాపులర్ అయింది. అలాగే సామ్ పెళ్లి తర్వాత లింగ భైరవి మాత గురించి ఎంతమందికి తెలిసిందో.. ‘భూత శుద్థి వివాహం’ గురించి కూడా అంతే మందికి తెలిసింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్‌లో ఈ లింగ భైరవి ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మవారిని సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ లింగ భైరవి ఆలయం గురించి తెలుసు.

నవరాత్రి వేళల్లో లింగ భైరవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు ఇవి. లింగ భైౖరవి దేవికి నిత్యం పూజలు చేసి, అమ్మవారిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు.

ఇక భూత శుద్థి వివాహం అనేది యోగా సంప్రదాయ విధానంలో వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్థతి.

ఇందులో పేరుకు తగ్గట్టుగానే ఆలోచనలు, భావోద్వేగాలు, భైతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు రూపొందించిన విశిష్టమైన ప్రక్రియ ఇది.

లింగ భైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు వధూవరుల దేహాన్నిశుద్థి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.

హిందూ జంటలకు చేేస సంప్రదాయ మంత్రోచ్ఛారణలతో పాటూ వధూవరుల శరీరం, మనసు, జీవశక్తి స్థాయిలను సమన్యయం చేసే యోగిక క్రతువులతో ఈ వివాహం జరుపుతారు.

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేవారు సామ్. ఆ ప్రదేశంతో ఉన్న ప్రత్యేక అనుబంధమే ఈ వివాహ ప్రక్రియను ఎంచుకోవడానికి కారణమని చెబుతున్నారు.