Junior: కిరీటి, శ్రీలీల.. ‘లెట్స్ లివ్ ది మూమెంట్’ లిరికల్ వీడియో రిలీజ్

ABN , Publish Date - May 19 , 2025 | 01:52 PM

గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్‌’. శ్రీలీల కథానాయిక.

junior

గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి (Kireeti) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’ (Junior). శ్రీలీల (Sreeleela) కథానాయిక. రాధాకృష్ణ (Radha Krishna) దర్శకత్వం వహించగా వరాహి చలనచిత్ర బ్యానర్ పై రజని కొర్రపాటి నిర్మించారు. కన్నడ సీనియర్ నటుడు రవిచంద్రన్ (Ravichandran), జెనీలియా (Genelia) కీలకపాత్రలు చేస్తున్నారు.

ఇటీవలే ఈ ‘జూనియర్’ (Junior) సినిమాాను జూలై 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన మూవీ యూనిట్ తాజాగా.. సినిమా నుంచి లెట్స్ లివ్ ది మూమెంట్ (Let's Live This Moment) అనే లిరికల్ వీడియో పాటను రిలీజ్ చేశారు.

రాక్ స్టార్ దేవీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి (Shreemani) సాహిత్యం అందించగా జస్ప్రీత్ జాజ్ (Jaspreet Jasz) ఆలపించారు. కిరీటి, శ్రీలీలపై తెరకెక్కించారు. పాట పూర్తిగా వింటేజ్ దేవీశ్రీని గుర్తు చేసేలా ఉంది.

Updated Date - May 19 , 2025 | 01:52 PM