Sreeleela: ఒక సెల్ఫీ.. వంద రూమ‌ర్స్! శ్రీలీల.. కార్తీక్‌ల మ‌ధ్య అస‌లేం జ‌రుగుతోంది?

ABN, Publish Date - May 16 , 2025 | 12:46 PM

తెలుగ‌మ్మాయి శ్రీలీల వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఒక‌దాన్ని మించి మ‌రో భారీ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Sreeleela

తెలుగ‌మ్మాయి శ్రీలీల (Sreeleela) వ‌రుస సినిమాల‌తో జెట్ స్పీడుగా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఒక‌దాన్ని మించి మ‌రో భారీ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పుష్ఫ ది రూల్ (Pushpa -2) సినిమాలో చేసిన కిస్సిక్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపును ద‌క్కించుకున్న ఈ ముద్ద‌దుగుమ్మ ఇప్పుడు ఆ క్రేజ్‌ను ఉప‌యోగించుకునే ప‌నిలో ప‌డింది.

ఈక్ర‌మంలో టాలీవుడ్‌లో మాదిరిగానే బాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. బాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాల‌కు సైన్ చేసింది. కార్తీక్ ఆర్య‌న్‌తో అషికీ3 (Ashiqui 3) తో పాటు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో, కరన్ జోహార్ (Karan Johar) దోస్తానా సీక్వెల్ చిత్రాలు చేతిలో ఉన్నాయి.

ఇప్ప‌టికే.. స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరోగా రూపొందుతున్న (అషికీ 3)లో శ్రీలీల ర‌థానాయుక‌గా న‌టిస్తుండ‌గా ప్ర‌స్త‌తుం ఈ చిత్రం షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన‌, లీక్ అవుతున్న ఫొటోలు, వీడియోలు సినిమాపై ఏమో గానీ వారిరువురి జంట‌పై మాత్రం ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అనేక ర‌కాల వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వాళ్లిద‌ద్ద‌రూ చూడ‌డానికి అందంగా ఉండ‌డం, ఏజ్ గ్యాప్ అంత‌గా లేక పోవ‌డంతో ఫెయిర్ అదిరిపోయింద‌ని మాట్లాడుకుంటూనే వాళ్ల మ‌ధ్య‌ ఏదో న‌డుస్తుందంటూ న్యూస్ త‌రుచూ వినిపిస్తున్నాయి. దీంతో వీరిప్పుడు బీ టౌన్‌లో ఓస్ట్ సెల‌బ్రేటెడ్ ఫెయిర్‌గా ప్ర‌త్యేక గుర్తింపును సైతం తెచ్చుకున్నారు.

గ‌తంలో కార్తీక్ (Kartik Aaryan) త‌ల్లి డాక్ట‌రే త‌న‌కు కోడలిగా వ‌స్తుంద‌ని అన‌డం, వారింట వేడుక‌కు శ్రీలీల (Sreeleela) వెళ్ల‌డం వెర‌సి వీరి ప్రేమ వార్త‌ల‌కు అజ్యం పోసిన‌ట్లైంది. దీంతో ఇప్ప‌టికే వీరిద్ద‌రి విష‌యంలో పుంకాను పుంకాలు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న స‌మ‌యంలో కార్తీక్‌, శ్రీలీల దిగిన మిర్ర‌ర్ సెల్ఫీ మ‌రిన్ని కొత్త వార్త‌ల‌కు కేంద్రం అయింది.

అప్ప‌టి వ‌ర‌కు వ‌స్తున్న వార్త‌ల‌ను మ‌రింత‌గా పెంచేవిగా ఉన్నాయి. అంతేకాక ప్ర‌స్తుతం కార్తిక్, శ్రీలీల న‌టిస్తున్న సినిమా నుంచి వ‌చ్చిన‌ ఫొటోల్లో వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఫెవికాల్ బంధం అనేలా క‌నిపిస్తుండ‌డంతో చాలామంది వారిపై వ‌స్తున్న వార్త‌ల‌కు ఫిక్స్ అయిపోయారు. ఎవ‌రెన్ని చెప్పినా ఆ జంట‌ ప్రేమ‌లోనే ఉన్నార‌ని త్వ‌ర‌లోనే ఆ విష‌యం బ‌య‌ట ప‌డుతుంద‌ని అప్ప‌ట‌వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే అని నెటిజ‌న్లు, ప‌లు హిందీ మీడియాలు అంటున్నాయి.

Updated Date - May 16 , 2025 | 01:08 PM