Kriti Sanon: ఇది మహేష్ బాబుకు పెద్ద అవమానమే..
ABN , Publish Date - Dec 09 , 2025 | 09:06 PM
సాధారణంగా స్టార్స్ ఎవరు ఇంటర్వ్యూలకు వెళ్లినా యాంకర్స్.. వేరే హీరోల గురించి, హీరోయిన్ల గురించి, వారు పనిచేసినవారి గురించి అడుగుతూ ఉంటారు.
Kriti Sanon: సాధారణంగా స్టార్స్ ఎవరు ఇంటర్వ్యూలకు వెళ్లినా యాంకర్స్.. వేరే హీరోల గురించి, హీరోయిన్ల గురించి, వారు పనిచేసినవారి గురించి అడుగుతూ ఉంటారు. అయితే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఆచితూచి ఆన్సర్ చెప్పకపోతే మాత్రం ఫ్యాన్స్ మధ్య వార్ మొదలవ్వడం ఖాయం.. అదే ఫ్యాన్స్ వారిని ట్రోల్ చేయడం ఖాయం. సరిగ్గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ది కూడా ఇదే పరిస్థితి. ఒక హీరో గురించి చెప్పి ఇంకో హీరో గురించి చెప్పకపోవడంతో ఆ హీరో ఫ్యాన్స్ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. (Mahesh Babu)
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ కి వన్ నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరో. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అయితే వన్ నేనొక్కడినే ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. హిందీలో సినిమాలు చేస్తున్నా కూడా ఈ చిన్నదాన్ని తెలుగువారు మహేష్ హీరోయిన్ గానే గుర్తుపడతారు.
ఇక ప్రస్తుతం కృతి సనన్.. హిందీలో తేరే ఇష్క్ మే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారింది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో యాంకర్ ఆమె హైట్ గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీలో పొడుగుగా ఉన్న హీరోయిన్లు తక్కువ.. మీరు చాలా పొడుగు ఉన్నారు. ఇంకా మీతో నటించిన హీరోలు మీకన్నా హైట్ తక్కువగా ఉన్నారు అన్న ప్రశ్నకు కృతి నిజమే అని సమాధానం చెప్పింది. ' అవును.. నేను హైట్ ఉంటాను. నేను చేసిన హీరోల్లో చాలామంది నాకన్నా హైట్ తక్కువ. ప్రభాస్, అర్జున్ కపూర్ లాంటివారు నాకన్నా ఎత్తుగా ఉంటారు' అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఒక్క మాట మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది.
బాలీవుడ్ లో స్థిరపడకముందే కృతి.. మహేష్ పక్కన నటించింది. ఈ సినిమానే ఆమెను హీరోయిన్ గా నిలబెట్టింది. మొదటి సినిమా హీరో గురించి మాట్లాడడం మర్చిపోవడం అంటే.. అతనిని అవమానించినట్టే. మహేష్ ను అలా ఎలా మర్చిపోతావు అంటూ ఫ్యాన్స్ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఇప్పటికైనా కృతి తప్పు తెలుసుకొని ఈ ట్రోలింగ్ పై స్పందిస్తుందేమో చూడాలి.