Solo Boy: సోలోబాయ్ నుంచి.. కృష్ణుడికెంతో వీడియో సాంగ్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 07:50 PM

బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా న‌టించిన‌ సోలోబాయ్ నుంచి.. కృష్ణుడికెంతో వీడియో సాంగ్ ను గురువారం రిలీజ్ చేశారు.

solo

బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ (Gautham Krishna), శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి (Ramya Pasupuleti) లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం సోలో బాయ్ (Solo Boy). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై (Sevenhills production) సతీష్ నిర్మించగా పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. ‘మధ్య తరగతి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మకంగా, భావోద్వేగాలతో పాటు వాణిజ్య హంగుల కలబోతగా తెరకెక్కింది. జూలై 4న ఈ చిత్రం విడుదలవుతోంది.

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ట్రైల‌ర్, పాట‌లు మంచి రెస్పాన్స్ పొందాయి. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ నుంచి కృష్ణుడికెంతో (Krishnudikentho Lyrical Video) అంటూ సాగే ఓ మెలోడి వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి (Kalyan Chakaravarthy) సాహిత్యం అందించ‌గా జుడా సాండీ (Judah Sandhy) సంగీతం అందించాడు.

Updated Date - Jun 26 , 2025 | 07:50 PM