Danger Movie: యువతా నీ గమ్యం ఎటు వైపు

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:58 AM

హీరో కృష్ణసాయి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘డేంజర్‌’. ఆదివారం నిర్వహి ంచిన కార్యక్రమంలో ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు? అంటూ...

హీరో కృష్ణసాయి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘డేంజర్‌’. ఆదివారం నిర్వహి ంచిన కార్యక్రమంలో ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు? అంటూ సందేశాత్మకంగా సాగే గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా కృష్ణసాయి మాట్లాడుతూ ‘తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు మా బాధ్యతగా డ్రగ్స్‌పై ఓ చైతన్యవంతమైన గీతాన్ని రూపొందించాం. మా ప్రయత్నాన్ని గవర్నర్లు, పోలీస్‌ అధికారులు ప్రశంసించారు. ఈ సినిమా ప్రజలను ప్రభావితం చేస్తుంది. యువతలో మార్పు తీసుకొస్తుందనే నమ్మకం మాకుంది’ అని అన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 05:59 AM