Cheekati Velugulu: ఐదు పదుల చీకటి వెలుగులు

ABN , Publish Date - Jul 11 , 2025 | 09:58 PM

అనుభవజ్ఞుల మాట అక్షరాలా నిజమవుతుందని అంటారు. కొన్నిసార్లు వారి పలుకు కూడా ఓటుపోవచ్చు. అది వేరే విషయం. నటశేఖర కృష్ణ (Krishna) తన 100వ చిత్రంగా 'అల్లూరి సీతారామరాజు' (Alluri Seetarama Raju)ను నిర్మించి నటించారు.

Cheekati Velugulu

Cheekati Velugulu: అనుభవజ్ఞుల మాట అక్షరాలా నిజమవుతుందని అంటారు. కొన్నిసార్లు వారి పలుకు కూడా ఓటుపోవచ్చు. అది వేరే విషయం. నటశేఖర కృష్ణ (Krishna) తన 100వ చిత్రంగా 'అల్లూరి సీతారామరాజు' (Alluri Seetarama Raju)ను నిర్మించి నటించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి (Chakrapani) - 'ఈ సినిమా నీకు సరికొత్త ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంది. అయితే నీ రాబోయే చిత్రాలకు ఈ ఇమేజ్ అడ్డంకిగా మారుతుంది' అని జోస్యం చెప్పారు. చక్రపాణి చెప్పినట్టుగానే 'అల్లూరి సీతారామరాజు' ఘనవిజయం సాధించి 1974 బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఆ తరువాత వచ్చిన కృష్ణ 17 సినిమాలు పరాజయం పాలయ్యాయి. మళ్ళీ 1976 సంక్రాంతికి వచ్చిన 'పాడిపంటలు'తోనే కృష్ణ సక్సెస్ ట్రాక్ పైకి వచ్చారు. ఆ పరాజయం పాలయిన సినిమాల్లో జనాన్ని పాటలతో ఆకట్టుకున్న చిత్రంగా 'చీకటి వెలుగులు' (Cheekati Velugulu) నిలచింది. 1975 జూలై 11న విడుదలైన 'చీకటి వెలుగులు' చిత్రాన్ని కె.యస్.ప్రకాశరావు (KS Prakasa Rao) దర్శకత్వంలో కానూరి రంజిత్ కుమార్ (Kanuri Ranjit Kumar)నిర్మించారు. ఇందులో వాణిశ్రీ (Vanisree), పద్మప్రియ నాయికలుగా కనిపించారు.


మిలిటరీలో పనిచేసే హీరో యుద్ధంలో ఓ విస్ఫోటనం చూసి స్పృహ తప్పుతాడు. అతనికి గతం గుర్తురాదు. ఆ సమయంలో ఓ డాన్సర్ పరిచయమవుతుంది. ఆమె ద్వారా మనశ్శాంతి పొందుతాడే కానీ, గతం జ్ఞప్తికి రాదు. పలు మలుపులు తిరిగాక, హీరోకు అన్నీ గుర్తుకు వస్తాయి. కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రంలో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రమాప్రభ, సూర్యకాంతం, మిక్కిలినేని, రావు గోపాలరావు, పేకేటి శివరామ్, జ్యోతిలక్ష్మి నటించారు. ఈ సినిమాకు ముళ్ళపూడి వెంకటరమణ మాటలు రాశారు. పాటలను దేవులపల్లి, ఆత్రేయ, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, ప్రయాగ పలికించారు. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి.


తెలుగు చిత్రసీమలో పబ్లిసిటీ డిజైనర్స్ గా విశేషఖ్యాతి గాంచిన గంగాధర్, ఈశ్వర్ ఇద్దరూ ఈ సినిమాకు పబ్లిసిటీ డిజైన్స్ రూపొందించడం విశేషం! ఈ చిత్రానికి దర్శకుడు కె.యస్.ప్రకాశరావు కథను సమకూర్చారు. ప్రమాదవశాన హీరోకు గతం గుర్తులేకపోవడం, తరువాత కథ పలు మలుపులు తిరగడం వంటి అంశంతో అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు రూపొందాయి. వాటిలో ఏయన్నార్ 'పవిత్రబంధం', ఆ తరువాత బాలకృష్ణ 'విజయేంద్రవర్మ' ఉన్నాయి. ఈ తరహా కథల్లో స్టార్స్ నటించిన ఏ చిత్రాలు విజయం సాధించక పోవడం గమనార్హం!

Nagababu: గుర్తుపట్టలేకుండా మారిపోయిన నాగబాబు.. ఏమైంది

Updated Date - Jul 11 , 2025 | 09:58 PM