Kottapalli Okkappudu: యాక్టర్స్‌ని తిట్టాను కొట్టాను

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:07 AM

‘మా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో రెండు పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు కీలకంగా నిలుస్తాయి. వారి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా రాకపోతే...

‘మా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో రెండు పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు కీలకంగా నిలుస్తాయి. వారి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా రాకపోతే సినిమా సాదాసీదాగా ఉంటుంది. అందుకే వారి నుంచి మంచి నటన రాబట్టాలనుకన్నాను. సెట్‌లో వారిని తిట్టాను, కొట్టాను, వారిపై రాళ్లు విసిరాను. మనం చేసే పాత్రలో జీవించడమే నటన అని నమ్ముతాను. అందుకే సినిమా కోసం ఏదైనా సరే తప్పదు. అందుకే వారిపట్ల అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పలేదు’ అని దర్శకురాలు ప్రవీణ పరుచూరి చెప్పారు. రానా సమర్పణలో మనోజ్‌ చంద్ర, మోనికా జంటగా ప్రవీణ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మనోజ్‌ చంద్ర మాట్లాడుతూ ‘ప్రవీణ చేసే సినిమాల్లో నటిస్తే సరిపోదు, పాత్రల్లో జీవించాలి. అలా రామకృష్ణ పాత్రకు నేను ప్రాణం పోశానని నమ్ముతున్నాను’ అని చెప్పారు.

Updated Date - Jul 13 , 2025 | 02:07 AM