Kota Srinivasarao: కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం
ABN , Publish Date - Jul 13 , 2025 | 07:39 AM
కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం..1994 అక్టోబర్ లో చోటు చేసుకుంది.
కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం..1994 అక్టోబర్ లో చోటు చేసుకుంది. దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర సమాఖ్య మధ్య ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానై యావత్ పరిశ్రమే స్తంభించిన నేపథ్యం లో ఈ రెండు వర్గాల కార్మికుల సంక్షేమం, సమైక్యత కోసం నిరాహార దీక్ష చేపట్టారు కోట. ఇది ఆయన జీవితంలోనే కాదు సినిమా చరిత్రలోనూ విశిష్ట ఘట్టమే.
ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ బలం ఏమిటో మద్రాసులోని ఫెఫ్సీ కి తెలిపిన కీలక ఘట్టం అది. తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడానికి ఇకపై ఏం చేయాలో ఇటు ప్రభుత్వం, అటు పరిశ్రమ ఆలోచింపజేసేలా చేసిన సంఘటన అది. హీరోలందరూ కోట దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. ఆ ఏడాది నవంబర్ 30 న హైదరాబాద్ లో మొక్కుబడిగా నైనా షూటింగ్స్ ప్రారంభమయ్యాయంటే దానికి కారణం కోట చేపట్టిన దీక్ష అనే చెప్పాలి.
ఆయన లక్కీ నంబర్ 8 (Kota lucky Number)
తానే నటుడి రిఫరెన్స్ తీసుకోకుండా తానే పదిమందికి రిఫరెన్స్ లా నిలిచారు కోట శ్రీనివాసరావు. ఆయనకి సెంటిమెంట్స్ ఎక్కువ. మానవతా సంబంధమైన సెంటిమెంట్స్ నీ ఆయన ఎక్కువగా గౌరవించే వారు. 8 తన లక్కీ నంబర్ గా కోట చెప్పేవారు. తెలుగులో తన పేరు ఎనిమిది అక్షరాలు అని, ఇంగ్లీష్ లోని అక్షరాలు కూడిన ఎనిమిది వస్తుందని చెప్పేవారు. తనకు ఎంతో పేరు తెచ్చిన ప్రతిఘటన చిత్రం విడుదల తేదీ, సంవత్సరం, నెల .. అన్నీ , కూ డితే 8 వస్తుందని, తానుడే రోడ్ నంబర్ కూడా ఎనిమిదె నని ఆయన చెప్పేవారు. ఇది యాదృచ్చికంగా తనకు ఎదురవుతున్న నంబర్ అని, దాని మీద గౌరవం పెంచుకున్నానని కోట శ్రీనివాసరావు చెప్పేవారు