Kishkindhapuri Movie: ఆబాల గోపాలాన్ని అలరించే చిత్రం
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:18 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కిష్కిందపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కిష్కిందపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిత్రబృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో తొలి గీతాన్ని విడుదల చేసింది. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌కు చైతన్ భరద్వాజ్ స్వరాలందించగా, పూర్ణాచారి సాహిత్యం అందించారు. జావేద్ అలీ ఆలపించారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఆబాల గోపాలాన్ని అలరించే చిత్రమిది. ఈ హారర్ మిస్టరీ ఆధ్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది’ అన్నారు. ‘ఇది నా కెరీర్‌లో ప్రత్యేక చిత్రం. కొన్ని ఘట్టాలు చాలాకాలం పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి’ అని అనుపమా తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని కౌశిక్ చెప్పారు.