Kiran Abbavaram: లుంగీ కట్టు.. మాస్‌ లుక్‌

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:23 AM

కిరణ్‌ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్‌ నాని తెరకెక్కిస్తోన్న చిత్రం కె-ర్యాంప్‌. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బేనర్లపై రాజేశ్‌ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు.

కిరణ్‌ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్‌ నాని తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కె-ర్యాంప్‌’. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బేనర్లపై రాజేశ్‌ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కిరణ్‌ అబ్బవరం లుంగీ కట్టులో మాస్‌, క్లాస్‌ కలసిన మేకోవర్‌లో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో మందు బాటిల్స్‌తో డిజైన్‌ చేసిన లవ్‌ సింబల్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ దీపావళికి విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

Updated Date - Jul 01 , 2025 | 04:27 AM