Kiran Abbavaram: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తండ్రైన కిరణ్ అబ్బవరం
ABN , Publish Date - May 22 , 2025 | 10:56 PM
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రిగా ప్రమోషన్ పొందారు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య రహస్య (Rahasya) గురువారం పండంటి మగబిడ్డకు జన్మని చ్చింది. ఈ విషయాన్ని వారు గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించి కిరణ్.. హనుమాన్ జయంతి రోజే తండ్రి అయ్యానని.. జై శ్రీరామ్ అంటూ కొడుకు పాదాలను ముద్దాడుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుండగా కిరణ్ అభిమానులతో పాటు అందరి హీరోల అభిమానులు, నెటిజన్లు, టాలీవుడ్ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలాఉండగా ఐదేండ్ల క్రితం వచ్చిన రాజా వారు రాణి వారు చిత్రంతో హీరో హీరోయిన్లుగా నటించిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) , రహాస్య గోరక్ (Rahasya Gorak) లు ఆ సినిమా తర్వాత ప్రేమికులుగా మారారు. గత సంవత్సరం పెళ్లి చేసుకున్న వీరు ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.