Vijay Devarakonda: కింగ్‌డమ్' ఫస్ట్ సింగిల్ 'హృదయం లోపల' వచ్చేసింది 

ABN, Publish Date - May 02 , 2025 | 04:57 PM

'కింగ్‌డమ్' చిత్రం నుండి  'హృదయం లోపల' ఫుల్ సాంగ్  విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది.

'కింగ్‌డమ్' (Kingdom) చిత్రం నుండి  'హృదయం లోపల' ఫుల్ సాంగ్  విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandra) తన మనోహరమైన సంగీతంతో 'హృదయం లోపల' గీతాన్ని అందంగా మలిచారు. గాయని అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం.  ఈ గీతానికి కెకె కవితాత్మకమైన సాహిత్యాన్ని అందించారు. దార్ గై తనదైన కొరియోగ్రఫీతో పాటలోని భావోద్వేగానికి దృశ్యరూపం ఇచ్చారు.  'హృదయం లోపల' గీతం విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్ కి కథానాయకుడు విజయ్ దేవరకొండ  సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"3, VIP చిత్రాల సమయంలోనే అనిరుధ్ సంగీతానికి అభిమానిని అయిపోయాను. నటుడు కావాలనే నా కల నెరవేరితే, అతనితో కలిసి పని చేయాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత, నా పదమూడో సినిమాకి ఇది సాధ్యపడింది. మా కలయికలో మొదటి గీతం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది." అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - May 02 , 2025 | 04:57 PM