Vijay Deverakonda: టైమ్ పాస్.. ప్రశ్నలు అడగొద్దు!
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:26 PM
కొంతకాలంగా హాట్ టాపిక్‌గా ఉన్న బెట్టింగ్ యాప్స్ కేసులో బుధవారం ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా ఉన్న బెట్టింగ్ యాప్స్ (bettinag apps cas) కేసులో బుధవారం ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ (ED interrogation)కు హాజరయ్యారు. కొద్ది రోజులుగా అనేక చర్చలకు దారి తీసిన ఈ కేసులో హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నట్టు అనుమానంతో ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. విజయ్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక సమాచారం విషయంలో అధికారులు వివరణ కోరుతున్నారు.
ఈడీ కార్యాలయం ఎదుట మీడియా అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధానమిస్తూ.. టైమ్ పాస్ ప్రశ్నలు అడగొద్దని. విచారణ ముగిశాక నేనే పూర్తి వివరాలు వెల్లడిస్తా అంటూ కార్యాలయంలోనికి వెళ్లిపోయారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ను ఈడీ అధికారులు విచారించగా, రానా దగ్గుబాటికి ఆగస్టు 11న, మంచు లక్ష్మీకి ఆగస్టు 13న హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారిన ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.