Ketika Sharma: తమిళంపై కన్నేసిన.. రొమాంటిక్ బ్యూటీ! ఆఫర్లే ఆఫర్లు
ABN , Publish Date - Aug 21 , 2025 | 02:03 PM
ఐదేండ్లుగా అడపాదడపా సినిమాలు చేస్తూ తెలుగు నాట తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ కేతిక శర్మ
రొమాంటిక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఐదేండ్లుగా అడపాదడపా సినిమాలు చేస్తూ తెలుగు నాట తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma). ఇన్నాళ్లు కేవలం టాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టిన ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది.
అగ్ర హీరో కార్తీ సినమాతో పాటు రాజేష్ ఎం సెల్వ అనే డైరెక్టర్ రూపొందించే ఒ నూతన తమిళ చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. అంతేగాక కార్తిక్ నటించే కొత్త చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా, మరో రెండు మూడు సినీ అవకాశాలతో పాటు ఓ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించేందుకు కేతిక శర్మ (Ketika Sharma) సమ్మతం తెలిపినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇలా వరుస చిత్రాల్లో నటించనున్న కేతిక శర్మ కోలీవుడ్‌ను ఓ ఊపు ఊపేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
కాగా, తెలుగు, హిందీ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయానికి నోచుకోలేదు. రాబిన్‌హుడ్ లో చేసిన ప్రత్యేక గీతం అమెకు ఇండియా వెడ్‌గా గుర్తింపును తీసుకు వచ్చింది. ఇటీవలే శ్రీవిష్ణు సింగిల్ సినిమాతో తన ఖాతాలో హిట్ వేసుకుంది.