scorecardresearch

Y Ravi Shankar: కేతికను మిస్‌ అయ్యాం.. ఇప్పుడు సెట్‌ అయింది..

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:07 PM

'రాబిన్‌హుడ్‌'లో (Robinhood)చిత్రంతో కేతికశర్మ (kethika Sharma) నటించిన పాట సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో ఉంది.

Y Ravi Shankar: కేతికను మిస్‌ అయ్యాం..  ఇప్పుడు సెట్‌ అయింది..

'రాబిన్‌హుడ్‌'లో (Robinhood)చిత్రంతో కేతికశర్మ (kethika Sharma) నటించిన పాట సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో ఉంది. అయితే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్‌ (Y Ravi Shankar) నటి కేతిక శర్మ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. అసలు ‘పుష్ప’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కేతిక శర్మ చేయాలట. ఆయన మాట్లాడుతూ ‘‘‘అది దా సర్‌ప్రైజ్‌’ పాటతో కేతికశర్మ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ‘పుష్ప’లో ఐటమ్‌ సాంగ్‌ కోసం సమంత కంటే ముందు కేతికను కలవాలనుకున్నాం. కానీ, అప్పుడు మిస్‌ అయ్యాం. మళ్లీ ఇన్నేళ్లకు ఆమెతో వర్క్‌ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఆమె పాట ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీలీల చాలా బిజీగా ఉండి కూడా డేట్స్‌ అడ్జస్ట్‌ చేసింది’’ అని అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట రష్మికను అనుకున్నట్లు దర్శకుడు వెంకీ కుడుముల అన్నారు. డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించలేకపోయిందన్నారు. కథ చెప్పగానే శ్రీలీల ఓకే చెప్పారు. ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’’ అన్నారు. నితిన్‌ - వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఆరేస్టలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేస్తుండడం విశేషం.  

Updated Date - Mar 24 , 2025 | 02:12 PM