Keerthi Suresh: ఎల్లమ్మ.. హీరో అయ్యిపోయాడు.. ఇప్పుడు హీరోయిన్ పై రూమర్స్

ABN , Publish Date - Nov 26 , 2025 | 08:06 PM

మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రివాల్వర్ రీటా (Revolver Rita) నవంబర్ 28 న రిలీజ్ కు సిద్దమవుతుంది.

Keerthi Suresh

Keerthi Suresh: మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రివాల్వర్ రీటా (Revolver Rita) నవంబర్ 28 న రిలీజ్ కు సిద్దమవుతుంది. జెకె. చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్‌లపై సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ ఇంకా రెండు రోజులే ఉండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన కీర్తి సురేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తుంది.

ఇక రివాల్వర్ రీటా సినిమా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ ఎల్లమ్మ సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది. బలగం సినిమా తరువాత దర్శకుడు వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ఎల్లమ్మ. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో తిరుగుతో ఉంది. హీరోల మీద హీరోలు మారుతూ వచ్చారు. నానితో మొదలైన హీరోల వేట.. నితిన్, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్.. ఇలా సాగుతూ చివరికి దేవిశ్రీప్రసాద్ వరకు వచ్చి ఆగింది.

మ్యూజిక్ డైరెక్టర్ గా టప పొజిషన్ లో ఉన్న దేవి ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాలో దేవి పక్కన కీర్తి సురేష్ నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. దేవి లాంటి డెబ్యూ హీరో పక్కన కీర్తి సురేష్ నటించడానికి ఎలా ఒప్పుకుందా అని అందరూ గుసగుసలు ఆడుకున్నారు. తాజాగా ఆ ప్రశ్నకు కీర్తి సమాధానం చెప్పుకొచ్చేసింది. ఎల్లమ్మలో మీరు నటిస్తున్నారా..? అని అడిగితే.. ఆమె నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది.

అంతేకాకుండా తాన్ జర్నీ గురించి మాట్లాడుతూ.. తనకు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం ఇష్టమని, తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని చెప్పిన మహానటి ఇంకా తనను తాను నిరూపించుకోవాలని తెలిపింది. ఇప్పటివరకు తన ప్రయాణం చాలా సాఫీగా, ఆనందంగా గడుస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ఎల్లమ్మలో కీర్తి కాకపోతే ఇంకెవరు నటిస్తున్నారు. ఇప్పటివరకు హీరోల వేట అయ్యింది.. ఇప్పుడు హీరోయిన్ల వేటనా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Nov 26 , 2025 | 08:06 PM