Keerthy Suresh: వర్కింగ్ అవర్స్ వివాదం.. కీర్తి సురేష్ ఎటు సైడ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:54 PM
గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ గురించి చర్చ నడుస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deppika Padukone) ఈ వర్కింగ్ అవర్స్ వివాదాన్ని మొదలుపెట్టింది.
Keerthy Suresh: గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ గురించి చర్చ నడుస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deppika Padukone) ఈ వర్కింగ్ అవర్స్ వివాదాన్ని మొదలుపెట్టింది. 8 గంటలు మాత్రమే పనిచేస్తాను.. అంతకుమించి పనిచేయడం తన వల్ల కాదని, నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమని.. పని వలన ఆరోగ్యం చెడగొట్టుకోలేనని చెప్పి స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఆ తరువాత ఈ 8 గంటల పని వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు దీపికాకు సపోర్ట్ చేస్తే.. కొందరు విమర్శించారు.
తాజాగా మహనటి కీర్తి సురేష్ కూడా ఈ 8 గంటల పని వివాదంపై స్పందించింది. రివాల్వర్ రీటా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. 'నేను 9 నుండి 6 గంటల వరకూ అయినా చేయగలను. 9 నుండి 9 గంటల వరకు అయినా వర్క్ చేయగలను. నాకది సమస్య కాదు. కానీ 9 గం లకు చిత్రీకరణకు అందుబాటులో ఉండాలంటే నటులు, ఉదయం 5 గం లకు లేచి 7:30 లోపే సెట్ లో ఉండాలి. 6 గం.లకు చిత్రీకరణ పూర్తయితే ఇంటికి వెళ్లటానికి 9 గంటలు అవుతుంది. అదే 9 నుండి 9 వరకూ కాల్షీట్ అయితే ఇంటికి వెళ్లటానికి రాత్రి 11 గంటలు దాటేస్తుంది. ఇక వర్కౌట్ చేసి ప్రెష్ అయి నిద్రపోవటానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఏ మనిషికయినా నిద్ర అనేది ముఖ్యం.. అయితే ఎనిమిది గంటల నిద్ర అనేది మాకు ఎక్కడుంది.
నిద్ర అనేది లేకుండా అవసరం అనుకుంటే నేను ఎన్ని గంటలయినా నటిస్తాను. కానీ టెక్నిషియన్స్ మాకంటే ఎక్కువ సమయం సెట్ లో ఉంటారు. వారికింక రెండు మూడు గంటల నిద్రే ఉంటుంది. సౌత్ లో ముఖ్యంగా తెలుగు, తమిళ్ లో మనకు 8 గంటల వర్కే ఉంటుంది. మలయాళం, హిందీ ల్లో 12 గంటల కాల్షీట్ ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. ఈ లెక్కన కీర్తి.. దీపికాకు సపోర్ట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. నిద్ర ముఖ్యం అని చెప్పి.. 8 గంటల పనికి మద్దతు పలికి.. కావాలంటే నేను చేస్తాను అని చెప్పి తనవైపు మాట తిప్పేసింది. దీంతో కీర్తి ఎటు సైడ్ నిలబడకుండా చాలా తెలివిగా సమాధానం చెప్పిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.