Keerthi Suresh: చిరంజీవి బిగ్‌స్టార్‌.. లెజెండ్‌.. అభిమానులకు సారీ..

ABN , Publish Date - Nov 27 , 2025 | 08:15 AM

కొన్నాళ్ల క్రితం చిరంజీవి డాన్స్‌పై కీర్తి సురేశ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసింది. ఓ ఇంటర్వ్యూ రాపిడ్‌ ఫైర్‌లో చిరంజీవి కన్నా విజయ్‌ బెస్ట్‌ డాన్సర్‌ అని చెప్పిన జవాబు మెగా అభిమానులను నొప్పించింది

Keerthi Suresh

కొన్నాళ్ల క్రితం చిరంజీవి (chiranjeevi) డాన్స్‌పై కీర్తి సురేశ్ (Keerthi Suresh) చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసింది. ఓ ఇంటర్వ్యూ రాపిడ్‌ ఫైర్‌లో చిరంజీవి కన్నా విజయ్‌ బెస్ట్‌ డాన్సర్‌ అని చెప్పిన జవాబు మెగా అభిమానులను నొప్పించింది. దాంతో ఆమె వారి ఆగ్రహానికి గురైంది. తాజా ఈ ఇష్యూ మరోసారి వైరల్‌ అయింది. కీర్తి సురేశ్‌ కీలక పాత్రలో తెరకెక్కిన ‘రివాల్వర్‌ రీటా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఈ కామెంట్‌పై వివరణ ఇచ్చారు. ‘హీరో విజయ్‌ను నేనెంతగా అభిమానిస్తానో చిరంజీవి గారికి తెలుసు. చిరంజీవి సర్‌ కూడా నా ఫేవరెట్‌ హీరో. భోళా శంకర్‌లో ఆయనకు చెల్లిగా చేశారు. ఆ సమయంలో ఇద్దరం సెట్స్‌లో సరదాగా మాట్లాడుకునేవాళ్లం. ‘నీకు ఏ హీరో ఇష్టం, ఎవరి డాన్స్‌ అంటే ఇష్టం, ఎవరి నటన అంటే ఇష్టం?’ ఇలా షూటింగ్‌ టైమ్‌లో అడిగేవారు. అప్పుడు కూడా నా ఫేవరెట్‌ హీరోలతోపాటు విజయ్‌ డ్యాన్స్‌ అంటే ఇష్టమని ఆయనకే చెప్పా. సూర్య యాక్టింగ్‌, టైమింగ్‌ అంటే ఇష్టమని చెప్పా. ఇలా మా మధ్య సరదాగా జరిగిన సంభాషలు చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడను. ఇండియాలో ఉన్న గొప్ప నటులు చిరంజీవి ఒకరు. ఆయకొన మెగాస్టార్‌, లెజెండ్‌. మా కుటుంబం అంతా ఆయనకు ఎంతో రెస్పెక్ట్‌ ఇస్తాం. పైగా ఆయన, అమ్మ కలిసి సినిమాల్లో నటించారు. ఒకవేళ డాన్స్‌ విషయంలో ఆయన అభిమానులను బాధపెట్టి ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నా’ అని పేర్కొన్నారు.

నటిగా తన జర్నీ గురించి అడగగా.. ‘ఎప్పుడూ డిఫరెంట్‌ పాత్రలు చేయాలనే తపనపడుతుంటా. ఇప్పటికే కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశా. ఇలా ఇన్నేళ్లలో ఎంత చేసినా.. నట ప్రయాణం ఇప్పుడే స్టార్ట్‌ అయినట్లు అనిస్తుంటుంది. కానీ నేర్చుకోవలసింది మాత్రం చాలా ఉంది. నన్ను నేను ఇంకా నిరూపించుకోవాలి. ఇప్పటి నా ప్రయాణంలో హ్యాపీగా ఉన్నా’ అని అన్నారు. అలాగే వేణు ఎల్దండి తెరకెక్కించనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించట్లేదని క్లారిటీ ఇచ్చారు.

Updated Date - Nov 27 , 2025 | 08:15 AM