Kavya Thapar: థాయ్‌లాండ్‌లో గ్లామర్ తుఫాను.. అందాల గేట్లు ఎత్తిన ‘ఐస్మార్ట్ భామ’
ABN , Publish Date - May 19 , 2025 | 08:30 PM
2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కావ్య థాపర్.
2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కావ్య థాపర్ (Kavya Thapar). ఆ తర్వాత ఏక్ మినీ కథ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ అవకాశాలు దక్కించుకోవడానికి కాస్త సమయం పట్టింది.
ఆపై సందీప్ కిషన్ భైరవకోన, గోపీచంద్ విశ్వం, రామ్ ఐస్మార్ట్ శంకర్, రవితేజ ఈగ్, విజయ్ అంటోని బిచ్చగాడు2 అంటూ ఒకదాని తర్వాత మరోటి సినిమాలతో దుమ్ములేపింది. అయితే సినిమాల్లో తన నటన కన్నా బరువైన లేలేత అందాల ప్రదర్శణతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాలోయింగ్‌ను దక్కించుకుంది.
ప్రస్తుతం తెలుగులో ఓ రెండు చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కావ్య థాపర్ (Kavya Thapar) నిత్యం తన ఫొటోషూట్లతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా థాయ్‌లాండ్‌లో విహరిస్తున్న ఈ చిన్నది అక్కడి అందాలకు తోడు తన అందాలను రంగరించి తన ఫాలోవర్స్‌కు తనివితీరని ట్రీట్ స్తోంది.
వాటిని చూసిన వారంతా ఈ అమ్మడి టూర్ మరో పది రోజులు సాగాలి అంటూ కొరుకుంటున్నారు. ఎలాగో ఆమె సినిమాలు రావడానికి సమయం పడుతుంది అప్పటివరకు ఇలాగే నిత్యం విహారయాత్రలు చేసి కుర్రకారుకు వేసవిలో చల్లదనాన్ని, వర్షంలో వెచ్చదనాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నారు.