Kavya KalyanRam: కావ్య కళ్యాణ్ రామ్ కొత్త సినిమా
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:41 PM
పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నూతన చిత్రం గురువారం పూజ కార్యక్రమాలతో మొదలైంది.
పవన్ కేసరి(Pawan Kesari), కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya kalyanram) జంటగా నూతన చిత్రం గురువారం పూజ కార్యక్రమాలతో మొదలైంది. టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ నివ్వగా, ప్రశాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
కావ్యా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ 'దర్శక, నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో తీస్తున్న సినిమా ఇది. విజయ్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఓ మంచి చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నామ’ని అన్నారు.
విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ 'శంకర్ మంచి కథను రాసుకున్నారు. ఈ కథ నాకు చాలా నచ్చింది. మంచి ట్యూన్స్ వస్తున్నాయి. పవన్ పెద్ద హీరో అవుతాడని అనిపిస్తోంది. కావ్య గారు ఈ మూవీకి పెద్ద ఎస్సెట్ అవుతారు. విప్లవ్ గారితో బేబీ మూవీకి పని చేశాను’ అని అన్నారు.