Kattappa: కట్టప్ప జడ్జిమెంట్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:17 AM

‘బాహుబలి’ కట్టప్ప పాత్రధారి సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తీర్పుగల్‌ విర్కపడుమ్‌’. ధీరన్‌ దర్శకుడు. అక్కడ మంచి విజయం...

‘బాహుబలి’ కట్టప్ప పాత్రధారి సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తీర్పుగల్‌ విర్కపడుమ్‌’. ధీరన్‌ దర్శకుడు. అక్కడ మంచి విజయం అందుకున్న ఈ చిత్రాన్ని ‘కట్టప్ప జడ్జిమెంట్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత వెంకటస్వామి. ఈ నెల 13న ‘కట్టప్ప జడ్జిమెంట్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కట్టప్ప ఏ విషయంలో ఏ తీర్పు ఇచ్చాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. పూర్తి మాస్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. సత్యరాజ్‌ నటన సినిమాకు ప్రత్యేకాకర్షణ’ అని చెప్పారు. ‘సినిమా చూసిన తర్వాత నా పాత్రకు పరిపూర్ణ న్యాయం చేశాననే ఫీలింగ్‌ కలిగింది’ అని సత్యరాజ్‌ అన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 06:35 AM