Karmanye Vadhikaraste: 'పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు'

ABN , Publish Date - Aug 28 , 2025 | 02:45 PM

బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే'. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ఇతర  పాత్రల్లో నటించారు.

బ్రహ్మాజీ(Brahmaji), శత్రు(Satru), 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే' Karmanye Vadhikaraste). బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ఇతర  పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు.  ఇటీవల మధుర ఆడియో ద్వారా విడుదల అయినా  ట్రైలర్, పాటల్ని విడుదల చేసారు. సెప్టెంబర్ 19న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Karmanye Vadhikaraste.jpeg

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ 'కర్మణ్యే వాధికారస్తే' అనేది భగవద్గీత లోని ఒక పదం. దాని అర్థం 'పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు'. టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథకి సరి సాటిగా బ్రహ్మాజీ, శత్రు మరియు  'మాస్టర్' మహేంద్రన్ వారి నటన తో చిత్రానికి మరింత ప్రాణం పోశారు. ఇదొక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్,  స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా రూపొందించాం. ఇటీవల ట్రైలర్ విడుదలై సోషల్ మీడియా లో ట్రెండింగ్లో ఉంది.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధం గా ఉంది' అని అన్నారు. 

Updated Date - Aug 28 , 2025 | 02:45 PM