A Unique Love Story: క్షణాలన్నీ జ్ఞాపకాలై

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:13 AM

ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం అంటున్నారు సంతోశ్‌ శోభన్‌. ఆయన కథానాయకుడిగా

ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం అంటున్నారు సంతోశ్‌ శోభన్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చిత్రం టీజర్‌ లోనిదీ డైలాగ్‌. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ టీజర్‌ను మేకర్స్‌ శుక్రవారం విడుదల చేశారు. చెన్నైలో అనుకోకుండా కలసిన యువతీ యువకుల ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగిందనే లైన్‌ చుట్టూ ఆసక్తికరంగా సాగే కథ అని ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో మానస వారణాసి కథానాయిక. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్‌ నిర్మిస్తోంది.

Updated Date - Aug 09 , 2025 | 04:13 AM