Kanyakumari: పల్లెటూరి ప్రేమ కథ

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:50 AM

శ్రీచరణ్‌ రాచకొండ, గీత్‌ సైనీ జంటగా సృజన్‌ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కన్యాకుమారి’. నటి మధు శాలిని సమర్పించారు. ఈనెల 27న సినిమా విడుదలవుతోంది....

శ్రీచరణ్‌ రాచకొండ, గీత్‌ సైనీ జంటగా సృజన్‌ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కన్యాకుమారి’. నటి మధు శాలిని సమర్పించారు. ఈనెల 27న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. మధు శాలిని మాట్లాడుతూ సృజన్‌ తీసిన ‘పుస్తక విమానం’ నాకు బాగా నచ్చింది. అలాంటి కొత్త టాలెంట్‌ని సపోర్ట్‌ చేయాలనిపించింది. సృజన్‌ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. మంచి థియేట్రికల్‌ అనుభూతినిచ్చే చిత్రమిది’ అని తెలిపారు. దర్శకనిర్మాత సృజన్‌ మాట్లాడుతూ ‘సహజ పాత్రలతో ఆద్యంతం వినోదం అందించే చిత్రమిది. మంచి అనుభూతిని పొందాలంటే తప్పకుండా థియేటర్లలో చూడాలని ప్రేక్షకులను కోరుతున్నా. ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్న మధు శాలినికి కృతజ్ఞతలు’ అని అన్నారు. దర్శకుడు ప్రవీణ్‌ మాట్లాడుతూ మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది అని అన్నారు. చిత్ర కథానాయిక గీత్‌ సైని మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వర్షం పడినప్పుడు వచ్చే మట్టి సువాసన అంత స్వచ్ఛంగా ఉంటుంది. కన్యాకుమారి పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 05:50 AM