Rishab Shetty: బాయ్‌కాట్ ఎఫెక్ట్.. మొత్తం తెలుగులోనే మాట్లాడిన రిషబ్ శెట్టి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:49 PM
కొద్ది రోజులుగా కాంతార చాఫ్టర్1 సినిమా వార్తల్లో ప్రధానంగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
కొద్ది రోజులుగా కాంతార చాఫ్టర్1 (Kantara Chapter 1)సినిమా వార్తల్లో ప్రదానంగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగు సినిమాల విషయంలో కన్నడ భాషాభిమానుల దుష్ప్రవర్తన ఇతరత్రా విషయాలు ఇక్కడి అభిమానులను తీవ్రంగా నొప్పించాయి. దీంతో ఇక్కడా వారంతా బాయ్‌కాట్ కాంతారా అనే హ్యాష్‌ట్యాగ్ సైతం తెలుగు రాష్ట్రాలలో ట్రెండ్ అయింది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో రిషబ్ తెలుగులో కాకుండా కన్నడలో మాట్లాడడంపై కూడా బాగా ట్రోలింగ్ జరిగింది.
ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ ఈ ఇష్యూపై స్పందించి అన్ని భాషలను గౌరవించాలని బాయ్‌కాట్ అనే సంస్కృతి మనది కాదని పిలుపపునిచ్చి వారం రోజులుగా జరుగుతున్న సమస్యకు చెక్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడ ఎక్స్‌పోలో జరిగిన తాజా ప్రమోషనల్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి (rishab-shetty) అందరినీ ఆశ్చర్యపరుస్తూ పూర్తిగా తెలుగు భాషలోనే ప్రసంగించారు.
"తెలుగు ప్రజల ప్రేమ నాకు ఎంతో విలువైనది. నాడు కాంతారాకు అంత పెత్త విజయం మీ అభిమానంతోనే సాధ్యమైంది. మూడేళ్ల క్రితం ఇదే రోజున కాంతార (Kantara) మూవీ రిలీజ్ అయింది, అక్టోబర్ 2న #KantaraChapter1 సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాకు కూడా సపోర్ట్ చేయండి ఈ కొత్త కాంతార చాప్టర్ 1 కూడా మీ అంచనాలను అందుకుంటుందని నమ్ముతున్నాను" అని రిషబ్ చెప్పగా, అక్కడి అభిమానులు హర్షధ్వానాలు చేశారు.
కన్నడ తెలుగు అన్నదమ్ముల లాంటివారని చెబుతూ జూ. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడులకు కృతజ్ఙతలు తెలిపారు. అంతేగాక నేను మైత్రీలో (Mythri)లో జై హనుమాన్ (jai hanuman) సినిమా చేస్తున్నాను... ఆ సినిమా రిలీజ్ అప్పటికి తెలుగు పూర్తిగా నేర్చుకొని మాట్లాడతా అంటూ తెలిపారు. కేవలం రిషబ్ ఒక్కడే కాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా తెలుగులోనే మాట్లాడి ఆహుతులను ఉత్సాహా పరిచారు. అనంతరం హొంబలే ఫఙలింస్ ఏపీ ప్రభుత్వానికి, మంత్రులకు థ్యింక్స్ తెలుపుతూ ఓ నోట్ సైతం రిలీజ్ చేసింది.