కాంటా లగా షఫాలీ ఆకస్మిక మృతి

ABN , Publish Date - Jun 29 , 2025 | 02:26 AM

కాంటా లగా సాంగ్‌ ఫేమ్‌ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్‌ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా..

‘కాంటా లగా’ సాంగ్‌ ఫేమ్‌ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్‌ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. ఆమె మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని.. ఈ కేసును అనుమానాస్పదంగానే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, 2002లో వచ్చిన ‘కాంటా లగా’ అనే రీమిక్స్‌ పాటతో గుర్తింపు తెచ్చుకున్నారు షఫాలీ. ఆ తర్వాత ‘ముజ్సే షాదీ కరోగీ’, ‘హుడుగరు’ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ‘నాచ్‌ బలియే’, ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 13’ వంటి టీవి రియాలిటీ షోల్లో భాగమయ్యారు.

Updated Date - Jun 29 , 2025 | 02:35 AM