Kannappa Trailer: ట్రైలర్ రిలీజ్ అప్పుడే
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:32 AM
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’ ట్రైలర్‌ను ఈనెల 13న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా...
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’ ట్రైలర్‌ను ఈనెల 13న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేశారు. ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా, మోహన్ బాబు, ప్రభాస్, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు.