కన్నప్ప కల్పితం కాదు మన చరిత్ర
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:24 AM
‘కన్నప్ప అనే శివ భక్తుడు ఉండేవాడు. ఇప్పటికీ ఆయనను ఆరాధిస్తుంటారు. ‘కన్నప్ప’ సినిమా కథ కల్పితం కాదు.. అది మన చరిత్ర. మన మధ్యలో జీవించిన ఓ వ్యక్తి కథ’ అని అన్నారు హీరో మంచు విష్ణు...
‘కన్నప్ప అనే శివ భక్తుడు ఉండేవాడు. ఇప్పటికీ ఆయనను ఆరాధిస్తుంటారు. ‘కన్నప్ప’ సినిమా కథ కల్పితం కాదు.. అది మన చరిత్ర. మన మధ్యలో జీవించిన ఓ వ్యక్తి కథ’ అని అన్నారు హీరో మంచు విష్ణు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి. ఇదంతా శివ లీల అనిపిస్తోంది. కుటుంబమంతా కలసి ఈ చిత్రాన్ని హాయిగా చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నేను టికెట్ రేట్లు పెంచలేదు. ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే పెంచాం. నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో నటించారు. ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంది. దేవుడు, భక్తుడికి మధ్యలో ఎవరూ ఉండాల్సిన పని లేదు. మూఢ నమ్మకాలు అవసరం లేదు. దేవుడి మీద మనసారా భక్తి ఉంటే చాలు అని చెప్పాలని అనుకున్నాం.
ఈ చిత్రంలో మోహన్‌లాల్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘‘కన్నప్ప’ చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’ అని చెప్పారు. నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఒట్టేసి చెబుతున్నా అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు. నటుడు కౌశల్ మాట్లాడుతూ ‘ప్రస్తుత తరమంతా ‘కన్నప్ప’ చిత్రాన్ని చూడాలి’ అని కోరారు.