Shivanna: వైరల్ వయ్యారితో శివన్న స్టెప్పులు.. కుర్ర హీరో ఖంగుతిన్నాడుగా

ABN , Publish Date - Jul 13 , 2025 | 10:03 PM

కొంతమంది సీనియర్ హీరోలను చూస్తే అసలు ఆ హీరోలకు వయస్సవుతుందా అనే అనుమానం కలుగకుండా పోదు. అలాంటి హీరోల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఒకరు.

Junior Pre Release Event

Shivanna: కొంతమంది సీనియర్ హీరోలను చూస్తే అసలు ఆ హీరోలకు వయస్సవుతుందా అనే అనుమానం కలుగకుండా పోదు. అలాంటి హీరోల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఒకరు. అంటే ఫేస్ పరంగా కాకపోయినా ఆయన ఎనర్జీ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా డ్యాన్స్ వేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. శివన్న ఎక్కడ ఎప్పుడు ఎవరితో డ్యాన్స్ చేశాడు అనే కదా డౌట్. తెలుసుకుందాం రండి.


గాలి జనార్ధనరెడ్డి కుమారుడు గాలి కిరీటి రెడ్డి జూనియర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో కిరీటి సరసన శ్రీలీల నటిస్తుండగా.. జెనీలియా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.


బెంగుళూరులో నిర్వహించిన ఈ వేదికపై శివన్న హంగామా చేశాడు. ఈమధ్యనే జూనియర్ సినిమా నుంచి వైరల్ వయ్యారి అనే ఊర మాస్ సాంగ్ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సాంగ్ కు స్టేజిపై శ్రీలీల, కిరీటితో పాటు శివన్న కూడా స్టెప్పులు వేసి అదరగొట్టాడు. కిరీటి అయినా కూడా ఒక స్టెప్ వేసి చాలు అన్నాడు కానీ, శివన్న మాత్రం మంచి ఎనర్జటిక్ గా స్టెప్స్ వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వయస్సులో కూడా అంత ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్న శివన్న చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇలాంటివి చూసినప్పుడే వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అనిపిస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి జూనియర్ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jul 13 , 2025 | 10:03 PM