Kamal Haasan: థగ్ లైఫ్ కొత్త అప్డేట్ ఇదే 

ABN, Publish Date - May 15 , 2025 | 04:46 PM

దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చెన్నైలో జరగాల్సిన థగ్ లైఫ్ ఆడియో వేడుక పోస్టుపోన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త అప్డేట్ ఇస్తూ మేకర్స్ ఓ ప్రకటన చేశారు. 

కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ' థగ్ లైఫ్'  (thug life) జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.  దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చెన్నైలో జరగాల్సిన ఆడియో వేడుక పోస్టుపోన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త అప్డేట్ ఇస్తూ మేకర్స్ ఓ ప్రకటన చేశారు. 
మే 17న థగ్ లైఫ్ ట్రైలర్ ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. మే 24న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ జరగనుంది. 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. అంతకు ముందు, చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. తెలుగులో కమల్ హాసన్ కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆడియన్స్ అందరినీ కలవాలని కమలహాసన్ ఈ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయబోతున్నారు.  హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.   

Updated Date - May 15 , 2025 | 05:06 PM