Kamal Haasan: రజనీని కలసిన కమల్‌

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:59 AM

తన స్నేహితుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ బుధవారం కలుసుకున్నారు. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న రజనీకాంత్‌ నివాసంలో వీరిద్దరి భేటీ జరిగింది....

తన స్నేహితుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ బుధవారం కలుసుకున్నారు. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న రజనీకాంత్‌ నివాసంలో వీరిద్దరి భేటీ జరిగింది. డీఎంకే కూటమి తరపున రాజ్యసభకు ఎంపికైన కమల్‌ హాసన్‌.. ఈ నెల 25వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన మిత్రుడు రజనీకాంత్‌ను కలిశారు. ఈ మేరకు కమల్‌ హాసన్‌ ఓ ట్వీట్‌ చేస్తూ, ‘‘నూతన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు నా ఆనందాన్ని నాకెంతో ఇష్టమైన స్నేహితుడితో పంచుకున్నా. ఈ క్షణం నాకెంతో సంతోషంగా ఉంది’ అంటూ పేర్కొన్నారు. కాగా, గత 2018లో మక్కల్‌ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించిన కమల్‌ హాసన్‌... డీఎంకే కూటమిలో ఉన్న అవగాహనా ఒప్పందం మేరకు తమిళనాడు నుంచి పెద్దల సభకు నామినేట్‌ చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరు డీఎంకే సభ్యులు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 17 , 2025 | 06:01 AM