Rural Love Story: కమల్‌హాసన్ మెచ్చుకున్నారు
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:27 AM
యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉసురే’. టీజయ్ అరుణాచలం, జననీ కునశీలన్ జంటగా నటించారు. నవీన్ డి. గోపాల్ దర్శకత్వంలో...
యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉసురే’. టీజయ్ అరుణాచలం, జననీ కునశీలన్ జంటగా నటించారు. నవీన్ డి. గోపాల్ దర్శకత్వంలో మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించారు. ఆగస్టు 1న విడుదలవుతోంది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీనియర్ హీరోయిన్ రాశి మాట్లాడుతూ ‘ప్రేయసి రావే’ చిత్రంలో హీరో శ్రీకాంత్‌ని కొట్టాను. ఆ సినిమా సూపర్‌హిట్టయింది. ఇప్పుడు ‘ఉసురే’ చిత్రంలోనూ హీరోను కొట్టాను. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందేమో చూడాలి. ఇందులో హీరోయిన్ తల్లి పాత్ర పోషించాను. దర్శకుడు మంచి విజన్‌తో ‘ఉసురే’ను తెరకెక్కించారు. నిర్మాత గ్రాండియర్‌గా నిర్మించారు. సినిమాలో మంచి ట్విస్ట్ ఉంది. నా పాత్ర చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అన్నారు. నవీన్ డి. గోపాల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్‌ను కమల్‌హాసన్ గారికి చూపించాం. ఆయనకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు అచ్చతెలుగు సినిమా చూసిన అనుభూతినిస్తుంది అని ప్రశంసించారు’ అని తెలిపారు. మౌళి ఎం. రాధాకృష్ణ మాట్లాడుతూ ‘సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ పాయింట్‌ను చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కించాం. రాశి పాత్ర శక్తిమంతంగా ఉంటుంది’ అని చెప్పారు.