ADHIRA: ఎట్ట‌కేల‌కు.. ప్ర‌శాంత్ వ‌ర్మ ‘అధీర’ ఫ‌స్ట్ లుక్‌ వ‌చ్చింది

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:53 PM

డివీవీ దాన‌య్య కుమారుడు క‌ల్యాణ్ దాస‌రి హీరోగా రూపొందుతున్న కొత్త సూప‌ర్ హీరో చిత్రం అధీర మూవీ ఫ‌స్ట్ లుక్ నాలుగేండ్ల‌కు వ‌చ్చింది

ADHIRA

హ‌నుమాన్ ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివ‌ర్స్ (Prasanth Varma Cinematic Universe PVCU)లో భాగంగా కొత్త సూప‌ర్ హీరో చిత్రంగా ఆయ‌న నిర్దేశ‌క‌త్వంలో శ‌ర‌ణ్ కొప్పిశెట్టి (sharan koppisetty) ద‌ర్శ‌కుడిగా డివీవీ దాన‌య్య కుమారుడు క‌ల్యాణ్ దాస‌రి (Kalyan Dasari) హీరోగా రూపొందుతున్న చిత్రం అధీర (ADHIRA). అప్పుడెప్పుడో rrr రిలీజ్ స‌మ‌యంలో ప్రక‌టించి ఓ పోస్ట‌ర్ సైతం రిలీజ్ చేసిన మేక‌ర్స్ మ‌ళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమాకు మోక్షం ప్ర‌సాదించ‌డ‌మే కాక‌.. ఎట్ట‌కేల‌క ఆ సినిమాకు సంబంధించిన కీ అప్డేట్ ఇచ్చారు.

ADHIRA

తాజాగా ఈ రోజు (సెప్టెంబ‌ర్ 22 మంగ‌ళ‌వారం) ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ ప్ర‌ముఖ‌ సౌత్ ఇండియా అగ్ర న‌టుడు , ద‌ర్శ‌కుడు ఎస్జే సూర్య (SJ Suriyah) ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్న‌ట్లు వెళ్ల‌డించాడు. ఎప్పుడైతే ప్ర‌పంచ‌మంతా చీక‌టి అలుముకుంటుందో అప్పుడు మ‌న‌కు న‌మ్మ‌కం ఇచ్చేందుకు ఓ మెరుపు వ‌స్తుంద‌నే ప‌దాల‌తో సినిమా థీమ్‌ను ప‌రిచ‌యం చేశారు. సూప‌ర్ హీరోగా క‌ల్యాణ్ దాస‌రి, అత‌నితో పోటీ ప‌డే క్రూర‌మైన రాఓసుడి గెట‌ప్‌లో ఎస్జే సూర్య లుక్స్ బావున్నాయి.

ఆర్కేడీ స్టూడియోస్ (RKD Studios) డ్యాన‌ర్‌పై రివాజ్ ర‌మేశ్ దుగ్గ‌ల్ (Riwaz Ramesh Duggal) ఆర్కే దుగ్గ‌ల్ (RK Duggal)ఈ చిత్రాన్ని నిర్మిస్తోండ‌గ శ్రీచ‌ర‌ణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధ‌ఙంచి న‌టీన‌టులు, ఇత‌ర టెక్సీషియ‌న్ల వివ‌రాలు మ‌రిన్ని త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Updated Date - Sep 22 , 2025 | 12:53 PM