Kalpika: బాంబు పేల్చిన క‌ల్పిక తండ్రి.. రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:34 AM

న‌టి క‌ల్పిక ఇటీవ‌ల త‌రుచూ ప్రైవేట్ వ్య‌వ‌హారాల్లో వివాదాస్ప‌ద‌మ‌వుతూ మీడియాల్లో నిలుస్తూ వ‌స్తున్న‌ విష‌యం తెలిసిందే.

Kalpika

ప్ర‌ముఖ టాలీవుడ్‌ న‌టి, క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘యశోద’, ‘హిట్‌’ చిత్రాల‌తో గుర్తింపును ద‌క్కించుకున్న‌ క‌ల్పిక (Kalpika Ganesh) ఇటీవ‌ల త‌రుచూ ప్రైవేట్ వ్య‌వ‌హారాల్లో వివాదాస్ప‌ద‌మ‌వుతూ మీడియాల్లో ప్ర‌ధాన వార్త‌గా నిలుస్తూ వ‌స్తున్న‌ విష‌యం తెలిసిందే. ఆ మ‌ధ్య అభినవ్‌, మరో నటి ధన్య బాలకృష్ణల‌తో సైతం వివాదం పెట్టుకున్న ఆ ప‌టి నెల రోజు క్రితం ప‌బ్‌లో చేసిప ర‌చ్చ‌తొ హాట్ టాపిక్ అయింది. అది మ‌రువ‌క ముందే రెండు రోజుల క్రితం ఓ రిసార్ట్‌లే చేసిన వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చిక‌ల్పిక‌ను వార్త‌ల్లో వ్య‌క్తిని చేశాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా క‌ల్పిక తండ్రి సంఘవార్ గణేష్ (Sanghavar Ganesh) నా కూతురికి మెంటల్ డిజార్డర్ (Mental Disorder) ఉంది ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఓ సంచ‌ల‌నానికి తెర తీశాడు. నా కూతురు వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు ప్రమాదం ఉందని, ఇప్పటికే రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని, రిహాబిలిటేషన్ సెంటర్‌కు సైతం పంపించామని అన్నారు.

కానీ రెండేళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్‌లో ఉండి తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ చేయడం చేస్తోందని, నా కూతురిని తిరిగి మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోండి అంటూ కల్పిక తండ్రి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం ఈ వార్త బాగా వైర‌ల్ అవుతోంది.

Updated Date - Aug 01 , 2025 | 05:34 AM