Kanya Kumari: క‌ల‌లా కురిసినా.. క‌న్యాకుమారి నుంచి లిరిక‌ల్ సాంగ్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 10:16 PM

అనంద్ దేవ‌ర‌కొండ‌తో ‘పుష్పక విమానం’ అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన దామోదర్ త‌న మ‌లి ప్ర‌య‌త్నంగా రూపొందించిన చిత్రం క‌న్యాకుమారి (Kanya Kumari).

Kanya Kumari

గ‌తంలో అనంద్ దేవ‌ర‌కొండ‌తో ‘పుష్పక విమానం’ అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన దామోదర్ త‌న మ‌లి ప్ర‌య‌త్నంగా రూపొందించిన చిత్రం క‌న్యాకుమారి (Kanya Kumari). శ్రీచరణ్‌ రాచకొండ (Sreecharan Rachakonda), గీతాసైని (Geeth Saini) జంటగా న‌టించారు. అగ‌స్టు27న వినియ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ చిత్రం నుంచి క‌ల‌లా కురిసినా అనే పాట‌ను రిలీజ్ చేశారు. సృజ‌న్ అట్టాడ (Srujan Attada) ఈ గేయానికి సాహిత్యం అందించ‌గా శ్రీకృష్ణ (Sri Krishna), జ‌య‌శ్రీ ప‌ల్లెం (Jayasri Pallem) ఆల‌పించారు. ర‌వి నిడ‌మ‌ర్తి (Ravi Nidamarthy) సంగీతం అందించారు.

Updated Date - Aug 13 , 2025 | 10:16 PM