Kiran Abbavaram: మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినా.. ఆడియెన్స్‌ మమ్మల్ని నిలబెట్టారు.

ABN , Publish Date - Oct 21 , 2025 | 08:47 PM

హీరో కిరణ్ అబ్బవరం నటించిన “K-ర్యాంప్” సినిమా హౌస్‌ఫుల్ షోస్‌తో బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో దూసుకుపోతోంది. హైదరాబాద్‌లో జరిగిన ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో దిల్ రాజు, శ్రీను వైట్ల, సాయి రాజేశ్, వశిష్ఠ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Kiran Abbavaram

సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ.17.5 కోట్ల వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, ప్రస్తుతం హౌస్‌ఫుల్ షోస్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో “K-ర్యాంప్ ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్” ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, నిర్మాతలు ఎస్ కేఎన్, దర్శకులు శ్రీను వైట్ల, సాయి రాజేశ్, వశిష్ఠ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ.. 47 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. ప్రతి ఒక్కరి కష్టానికి ఇది ఫలితం. కిరణ్ గారి ఎనర్జీ, ప్యాషన్ వల్లే ఈ విజయం సాధ్యమైంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే ఆనందం కలుగుతోంది.ప్రొడ్యూసర్ రాజేశ్ దండ మాట్లాడుతూ.. నా ఫేవరేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మా సక్సెస్ మీట్‌కు రావడం గర్వంగా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించడం మా సినిమా పట్ల ఉన్న నమ్మకానికి గుర్తు. కిరణ్ గారితో మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నామ‌న్నారు.

సినీ ప్రముఖులు ఏమ‌న్నారంటే..

దిల్ రాజు మాట్లాడుతూ .. యంగ్ టీమ్ ఎనర్జీతో సినిమా చేస్తే రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. రైట్ కంటెంట్ తీసుకుని నిజాయితీగా సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని ఇస్తారు. ఈ దీపావళి బాక్సాఫీస్ పోటీలో ‘K-ర్యాంప్’ టాప్‌లో నిలిచింది.

శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ప్రేమించిన వారి లోపాలను అంగీకరించాలనే పాయింట్‌ను నాని పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించాడు. కిరణ్ లో ఉన్న ఎనర్జీ చూస్తే రవితేజ గుర్తొచ్చాడు.

వశిష్ఠ మాట్లాడుతూ.. “కిరణ్ గారు క సినిమాకి తర్వాత మరో సక్సెస్ అందుకున్నారు. నాని మంచి హిట్ ఇచ్చాడు. రాజేశ్ దండ గారి ప్యాషన్ అద్భుతం.”

సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “47 రోజుల్లో సినిమా చేయడం అంటే ఎంత కష్టపడ్డారో అర్థం అవుతుంది. ‘K-ర్యాంప్’ ప్రమోషన్ ఒక కేస్ స్టడీ లాంటిది.”

“ప్రతి సినిమాకు కష్టపడతాం కానీ ‘K-ర్యాంప్’ లో ఏదో మ్యాజిక్ ఉంది. మొదటి రోజు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినా నమ్మకం కోల్పోలేదు. ఆడియెన్స్‌నే మమ్మల్ని నిలబెట్టారు. ఇది నా కెరీర్‌లో బిగ్ మైలురాయి. ఇకపై కిరణ్ అబ్బవరం సినిమా అంటే థియేటర్‌కి నమ్మకంగా వెళ్లొచ్చని ప్రజలు అనిపించేలా సినిమాలు చేస్తా అన్నారు. హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ.. నా పాత్ర మెర్సీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కిరణ్ గారు చాలా సపోర్టివ్. అలాంటి హీరోతో మళ్లీ పనిచేయాలని ఉంది. చిన్నప్పటి రోల్ చేసిన మా రాజేశ్ గారి పాప చాలా బాగా నటించింది అన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 08:47 PM