Junior Trailer: యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:53 AM

గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం జూనియర్‌..

గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్‌’. శ్రీలీల కథానాయిక. రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ నెల 18న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి చేతుల మీదుగా శుక్రవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. దర్శకుడు ఈ చిత్రాన్ని యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. కిరీటిరెడ్డి తన సహజనటనతో అలరించారు. వైవా హర్ష, సత్య కామెడీ టైమింగ్‌ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. రొమాన్స్‌, ఎమోషన్స్‌ లాంటి అన్ని రకాల హంగులతో మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌. సినిమాటోగ్రఫీ:కేకే సెంథిల్‌ కుమార్‌

Updated Date - Jul 12 , 2025 | 01:53 AM